వైజాగ్ లోకల్ న్యూస్ - వైజాగ్ న్యూస్ / విశాఖపట్నం : పెందుర్తి నియోజకవర్గం పెదగాడి గ్రామంలో 1995లో జనసైతన్య లేఅవుట్ నుండి కొనుగోలు చేసుకున్న తమ ప్లాట్లకు రక్షణ కల్పించాలని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు
బుధవారం ఉదయం లేఅవుట్లో అసోసియేషన్ అధ్యక్షుడు అహ్మద్ కార్యదర్శి రంగనాయకులు తదితరులు మాట్లాడుతూ జన చైతన్య నుండి పూర్తి హక్కులతో కొనుగోలు చేసుకుని ప్లాట్లకు రక్షణ కూడా ఏర్పాటు చేసుకోగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అర్ధరాత్రి పూట కట్టుకున్న గోడలను కూలగోట్టి దౌర్జన్యం చేస్తూ అడిగిన వారిపై దాడి చేసి గాయపరిచారని పేర్కొన్నారు తమకు అనుకూలంగా మాట్లాడిన సర్పంచ్ భర్త త్రినాధ్ పై గ్రామానికి చెందిన గల్లా అప్పలరాజు అప్పారావు నీటి పల్లి రమేష్ తదితరులు దాడులకు పాల్పడ్డారని తెలియజేశారు ఇప్పటికైనా పోలీసులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పందించి తమ ప్లాట్లకు తమకు రక్షణ కల్పించాలని ఉన్నతఅధికారులకు వారు విజ్ఞప్తి వారు చేశారు
Vizag Local NewsAdmin