వైజాగ్ లోకల్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని, దేశంలో ఆయనతో పోల్చదగిన ప్రజాహిత నాయకుడు మరొకరు లేరని ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ కొనియాడారు. విజయవాడలో జీఎఫ్ఎస్‌టీ టూరిజం కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, చంద్రబాబు నాయకత్వ పటిమపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగు ప్రజల కోసం దేవుడు పంపిన వరంగా చంద్రబాబును అభివర్ణించారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులకు వేదికగా నిలిచింది.
అనంతరం కార్వాన్‌లను వారు పర్యాటక రంగంలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ఈ టూరిజం కాన్‌క్లేవ్ జరుగుతోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదాను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కాన్‌క్లేవ్ వేదికగా.. సీఎం చంద్రబాబు సమక్షంలో రూ.10, 039 కోట్ల విలువైన పెట్టుబడులపై రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకోనుంది. అలాగే పర్యాటకుల కోసం విశాఖపట్నం, రాజధాని అమరావతి, ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కొత్తగా హోటళ్ల నిర్మాణం కోసం ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ కాన్‌క్లేవ్‌లో రాష్ట్ర పర్యాటక రంగంపై వీడియోను ప్రదర్శించారు.
Vizag Local NewsAdmin