వైజాగ్ లోకల్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు : కరోనా సమయంలో మృతి చెందిన టీచర్ల కుటుంబాలకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద జెడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. కరోనా సమయంలో మృతి చెందిన టీచర్ల కుటుంబాలకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద జెడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కరోనా సమయంలో 2744 మంది ప్రభుత్వ ఉద్యోగులు మరణించగా, వారి కుటుంబాల్లో 1488 మందికి కారుణ్య నియామకాలు కింద ఉద్యోగాలు కల్పించారని గుర్తుచేశారు. మిగిలిన వారికి వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద కారుణ్య నియామకాల కల్పించారని పేర్కొన్నారు. అయితే, జడ్పీల్లో కారుణ్య నియామకాలు ఆయా డిపార్ట్‌మెంట్‌లలో మాత్రమే కల్పించాలనే క్లాజ్ చేర్చడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు.
Vizag Local NewsAdmin