వైజాగ్ లోకల్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి నెల రోజులపాటు వారాహి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో శీనానాయక్ దంపతులు తొలి సారెను సమర్పించారు. మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారే సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనానాయక్ మాట్లాడుతూ, తమ చేతుల మీదుగా అమ్మవారికి తొలి సారె సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు సారె సమర్పణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ నెల 29న అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారని ఆయన వెల్లడించారు. ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారికి శాఖాంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. జులై 8, 9, 10 తేదీలలో శాఖాంబరి ఉత్సవాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
Vizag Local NewsAdmin