Thursday, 15 January 2026 07:11:21 AM
 BREAKING NEWS
     -> వాట్సప్‌ బదులుగా స్వదేశీ యాప్‌ అయిన అరట్టైను ఉపయోగించుకోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది...      -> పాట్నా ఎన్నికల ప్రవర్తనా కోడ్ ఉల్లంఘన.. ప్రశాంత్ కిశోర్‌పై కేసు..      -> కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ సరికొత్త రికార్డ్.....      -> విశాఖకు పెద్దఎత్తున కంపెనీలు వస్తున్నాయి... నగరం రూపురేఖలు మార్చాలి: మంత్రి నారా లోకేశ్..      -> అక్టోబరు 14న ఒక చారిత్రక ఒప్పందం కుదుర్చుకోబుతున్నాం: సీఎం చంద్రబాబు..      -> ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విస్తృత స్థాయి సమావేశం..      -> జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి..ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌..      -> రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావు... ఉన్న వాటిని తరిమేస్తున్నారు : పోతిన వెంకట మహేష్..      -> వైసీపీలా అహంకారానికి పోవద్దని కార్యకర్తలకు గట్టి హెచ్చరిక : మంత్రి నారా లోకేశ్..      -> ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం పుష్కర్ సింగ్ ధామి విజ్ఞప్తి..      -> పూరీ రథయాత్రలో ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటన ..      -> టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ క్యాడర్ కు చంద్రబాబు దిశానిర్దేశం..      -> విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల 24 గంటల సమ్మె..      -> ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన యోగా గురు బాబా రామ్‌దేవ్..      -> హీరోలు సినిమా లైఫ్‌ని కాదు.. రియల్ లైఫ్‌ని ఆదర్శంగా తీసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి..      -> బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఏపీలోని అన్ని జిల్లాల్లో వర్షాలు..      -> బెజవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభమైన వారాహి ఉత్సవాలు.. ..

రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావు... ఉన్న వాటిని తరిమేస్తున్నారు : పోతిన వెంకట మహేష్


Date : 29 June 2025 03:48 PM Views : 467

వైజాగ్ లోకల్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : ఏడాది కాలంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికరంగం తిరోగమనంలో ఉందని వైయస్ఆర్‌సీపీ నాయకుడు, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురాలేక, గతంలో వైయస్ జగన్ హయాంలో సాధించిన ప్రగతిని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడుపుల కోసం పరిశ్రమలపై కూటమి నేతల రౌడీయిజం కారణంగా కొత్త పరిశ్రమలు రాకపోవడంతో పాటు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం నుంచి పారిపోతున్నాయని ధ్వజమెత్తారు.

ప్రతిసారీ చంద్రబాబు తన మేనిఫేస్టోలో అబద్దాలే చెప్పుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు గతం, వర్తమానం, భవిష్యత్తు అంతా ఒక అబద్దం. 1999 ఎన్నికల ప్రచారంలో ఇదే చంద్రబాబు కోటి ఉద్యోగాలు కల్పిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. వాటిల్లో కనీసం లక్ష ఉద్యోగాలు అయినా కల్పించారా? ఆయనకు దమ్ముంటే వెల్లడించాలి. అలాగే 2014-19 మధ్య 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పించకుంటే నిరుద్యోగభృతి కింద ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.2000 ఇస్తానని హామీ ఇచ్చారు. వీటిల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. అలాగే 2024లో ఏకంగా అయిదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని, లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు తీసుకువస్తానని, నిరుద్యోగులకు నెలకు రూ.3000 చొప్పున నిరుద్యోగభృతి ఇస్తానంటూ గొప్పగా వాగ్ధానాలు చేసి యువతను నమ్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vizag Local News

Admin

లైవ్ టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Vizag Local News 2026. All right Reserved.