వైజాగ్ లోకల్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో నిన్నటి నుంచి ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకటి లేదా రెండుచోట్ల 50-60 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీఎస్‌డీఎంఏ తెలియజేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Vizag Local NewsAdmin