వైజాగ్ లోకల్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : వైకుంఠపాళీ అభివృద్ధి వద్దని.. ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యమని, ప్రభుత్వాలు కొనసాగితే.. అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సుస్థిరపాలన ఉంటే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, యూపీ కొన్నేళ్లుగా ఒకే ప్రభుత్వంగా ఉందని.. ఒకప్పుడు యూపీ అంటే వెనుకబాటు తనం ఉండేది.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలను ఉద్దేశించిన ఆయన ప్రసంగించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉందని, అందుకే దేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఎన్నికల్లో దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేశాం. సంక్షేమం అంటే ఏంటో చూపించిన పార్టీ మనది. చేసిన పనిని ప్రజలకు చెప్పడం ముఖ్యం. భవిష్యత్తులో ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాలి” అని చంద్రబాబు పేర్కొన్నారు.
Vizag Local NewsAdmin